నేతలంతా ఒకవైపు.. బైడెన్‌ మరోవైపు!

జీ7 సదస్సు వేళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వ్యవహారశైలి చర్చనీయాంశమైంది. సదస్సుకు వచ్చిన నేతలు బృందచిత్రం కోసం నిలబడి ఉండగా.. వారంతా ఉన్నవైపు కాకుండా బైడెన్‌ మరోవైపు తిరిగి, ఎవరికోసమో వెతుకుతున్నట్టుగా ముందుకు వెళ్లారు.

Updated : 15 Jun 2024 06:15 IST

బారీ: జీ7 సదస్సు వేళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వ్యవహారశైలి చర్చనీయాంశమైంది. సదస్సుకు వచ్చిన నేతలు బృందచిత్రం కోసం నిలబడి ఉండగా.. వారంతా ఉన్నవైపు కాకుండా బైడెన్‌ మరోవైపు తిరిగి, ఎవరికోసమో వెతుకుతున్నట్టుగా ముందుకు వెళ్లారు. అక్కడే వేరేవారితో మాట్లాడుతూ ఉండిపోయారు. గ్రూప్‌ ఫొటో దిగేందుకు ఎంతసేపటికీ రాకపోవడంతో ఇటలీ ప్రధాని మెలోనీ వెళ్లి ఆయన్ను తీసుకొచ్చారు. ఆపై నేతలంతా బృందచిత్రానికి పోజిచ్చారు. సంబంధిత వీడియోను వీక్షించిన నెటిజన్లు బైడెన్‌ ఆరోగ్య పరిస్థితిపై అనుమానాలు వ్యక్తం చేశారు. వయసురీత్యా వచ్చే ఇబ్బందులతో బైడెన్‌ జ్ఞాపకశక్తిలో లోపాలను గుర్తించినట్లు గతంలో ఓ నివేదిక పేర్కొన్న సంగతి గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని