దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా మళ్లీ సిరిల్‌ రామఫోసా

సిరిల్‌ రామఫోసా (71) మరోసారి దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గత నెలలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో రామఫోసాకు చెందిన ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ మూడు దశాబ్దాల్లో తొలిసారిగా మెజారిటీని కోల్పోయింది.

Published : 16 Jun 2024 04:59 IST

జొహన్నెస్‌బర్గ్‌: సిరిల్‌ రామఫోసా (71) మరోసారి దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గత నెలలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో రామఫోసాకు చెందిన ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ మూడు దశాబ్దాల్లో తొలిసారిగా మెజారిటీని కోల్పోయింది. దీంతో ప్రత్యర్థులను అడ్డుకొని సంకీర్ణ సర్కారు ఏర్పాటు చేసేందుకు ఆయన డెమోక్రటిక్‌ అలయెన్స్‌తో చారిత్రక ఒప్పందం చేసుకోవాల్సి వచ్చింది. 400 స్థానాలు ఉన్న పార్లమెంటులో శుక్రవారం రాత్రి జరిగిన ఓటింగులో రామఫోసాకు 283 ఓట్లు రాగా.. ఆయన ప్రత్యర్థి అయిన ఎకనమిక్‌ ఫ్రీడమ్‌ ఫైటర్స్‌ అభ్యర్థి మలేమాకు 44 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో రామఫోసా మరోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని