పాక్‌లో బక్రీద్‌ కానుకగా పెట్రోల్‌ ధర రూ.10 తగ్గింపు

నగదు కొరత, రెండంకెల ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న పాకిస్థాన్‌ ప్రజానీకానికి ఊరటనిస్తూ ఈదుల్‌ అధా (బక్రీద్‌) పండగ సందర్భంగా అక్కడి ప్రభుత్వం లీటరు పెట్రోలుపై రూ.10.20, హైస్పీడ్‌ డీజిలు (హెచ్‌ఎస్‌డీ)పై రూ.2.33 మేర తగ్గించింది.

Published : 16 Jun 2024 05:35 IST

ఇస్లామాబాద్‌: నగదు కొరత, రెండంకెల ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న పాకిస్థాన్‌ ప్రజానీకానికి ఊరటనిస్తూ ఈదుల్‌ అధా (బక్రీద్‌) పండగ సందర్భంగా అక్కడి ప్రభుత్వం లీటరు పెట్రోలుపై రూ.10.20, హైస్పీడ్‌ డీజిలు (హెచ్‌ఎస్‌డీ)పై రూ.2.33 మేర తగ్గించింది. శనివారం నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిర్ణయంతో పెట్రోలు లీటరు ధర రూ.258.16, హెచ్‌ఎస్‌డీ రూ.267.89గా ఉంటుందని శుక్రవారం ట్రిబ్యూన్‌ వార్తాపత్రిక ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వెలువడిన ప్రకటనను ఉటంకిస్తూ పేర్కొంది. 2022 మే నుంచి పాకిస్థాన్‌ ద్రవ్యోల్బణం 20 శాతానికి పైగా ఉంది. పరిశ్రమల విద్యుత్తు ఛార్జీలను యూనిట్‌కు రూ.10.69 చొప్పున తగ్గిస్తున్నట్లు ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ ఇదివరకే ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని