ఏడేళ్ల తర్వాత ఆస్ట్రేలియాకు చైనా ప్రధాని

దౌత్యపరమైన సంబంధాలను మెరుగుపరుచుకోవడంలో భాగంగా చైనా ప్రధాని లీ కియాంగ్‌ శనివారం ఆస్ట్రేలియాకు చేరుకున్నారు. గత ఏడేళ్లలో చైనా ప్రధాని ఆస్ట్రేలియాలో పర్యటించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

Updated : 16 Jun 2024 06:26 IST

మెల్‌బోర్న్‌: దౌత్యపరమైన సంబంధాలను మెరుగుపరుచుకోవడంలో భాగంగా చైనా ప్రధాని లీ కియాంగ్‌ శనివారం ఆస్ట్రేలియాకు చేరుకున్నారు. గత ఏడేళ్లలో చైనా ప్రధాని ఆస్ట్రేలియాలో పర్యటించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. లీ ఇక్కడికి బయలుదేరడానికి ముందు న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌ నగరంలో మాట్లాడుతూ.. చైనాలో మొదటిశ్రేణి వ్యాపార వాతావరణం కల్పించడంతోపాటు విదేశీ కంపెనీలు అభివృద్ధి చెందడానికి మద్దతివ్వడం కోసం తమ దేశం కట్టుబడి ఉందని తెలిపారు. ఆస్ట్రేలియాలో గతంలో కన్జర్వేటివ్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు దేశాల మధ్య దెబ్బతిన్న దౌత్య సంబంధాలను ప్రస్తుత ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్‌ హయాంలో చక్కదిద్దుకోవాలని చైనా భావిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని