బ్రిటన్‌ రాజు అధికారిక జన్మదిన వేడుకల్లో కేట్‌ ప్రత్యక్షం

గత కొంతకాలంగా క్యాన్సర్‌ చికిత్స తీసుకుంటూ ప్రజాజీవితానికి దూరంగా ఉన్న వేల్స్‌ యువరాణి కేట్‌ మిడిల్డన్‌ శనివారం బ్రిటన్‌ ప్రజలకు దర్శనమిచ్చారు. లండన్‌లో జరిగిన కింగ్‌ ఛార్లెస్‌ అధికారిక పుట్టిన రోజు వేడుకల్లో ఆమె పాల్గొన్నారు.

Published : 16 Jun 2024 05:40 IST

చాన్నాళ్ల తర్వాత ప్రజలకు కనిపించిన వేల్స్‌ యువరాణి
తన క్యాన్సర్‌ చికిత్సలో పురోగతి కనిపిస్తోందని ప్రకటన

వేల్స్‌ యువరాణి కేట్‌ మిడిల్టన్‌

లండన్‌: గత కొంతకాలంగా క్యాన్సర్‌ చికిత్స తీసుకుంటూ ప్రజాజీవితానికి దూరంగా ఉన్న వేల్స్‌ యువరాణి కేట్‌ మిడిల్డన్‌ శనివారం బ్రిటన్‌ ప్రజలకు దర్శనమిచ్చారు. లండన్‌లో జరిగిన కింగ్‌ ఛార్లెస్‌ అధికారిక పుట్టిన రోజు వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ‘ట్రూపింగ్‌ ది కలర్‌’ పరేడ్‌లో తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆమె బగ్గీలో కూర్చుని కనిపించారు. ఈ కార్యక్రమంలో కేట్‌ భర్త.. బ్రిటన్‌ యువరాజు విలియం హ్యారీ కూడా పాల్గొన్నారు. తాను కీమోథెరపీ తీసుకుంటున్నానని మార్చిలో 42 ఏళ్ల కేట్‌ ప్రకటించారు. గత ఏడాది డిసెంబరు నుంచి ఆమె ప్రజాజీవితానికి దూరంగా ఉన్నారు. ‘‘చికిత్సలో పురోగతి కనిపిస్తోంది. కీమోథెరపీ తీసుకున్నవారందరికీ తెలుసు కొన్ని మంచి రోజులు ఉంటాయి.. కొన్ని చెడ్డ రోజులు ఉంటాయని’’ అని కేట్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తన చికిత్స మరికొన్ని నెలలు కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ‘ట్రూపింగ్‌ ది కలర్‌’ అనేది ఏటా నిర్వహించే పరేడ్‌. బ్రిటన్‌ రాజు అధికారిక పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు