రష్యా నిర్బంధ కేంద్రంలో సిబ్బందిని బందీలుగా చేసుకొని కలకలం

రష్యాలో రోస్తోవ్‌ ప్రాంతంలోని ఓ నిర్బంధ కేంద్రంలో ఆదివారం తీవ్ర కలకలం చెలరేగింది. అక్కడి కొంతమంది ఖైదీలు.. ఇద్దరు సిబ్బందితోపాటు కొందరు సహచర ఖైదీలను తమ బందీలుగా చేసుకొని భయభ్రాంతులకు గురిచేశారు.

Published : 17 Jun 2024 05:18 IST

నిందితులను మట్టుబెట్టిన బలగాలు 

మాస్కో: రష్యాలో రోస్తోవ్‌ ప్రాంతంలోని ఓ నిర్బంధ కేంద్రంలో ఆదివారం తీవ్ర కలకలం చెలరేగింది. అక్కడి కొంతమంది ఖైదీలు.. ఇద్దరు సిబ్బందితోపాటు కొందరు సహచర ఖైదీలను తమ బందీలుగా చేసుకొని భయభ్రాంతులకు గురిచేశారు. దీంతో భద్రతా బలగాలు ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టి.. కలకలానికి కారణమైన ఖైదీలను మట్టుబెట్టాయి. బందీలందరినీ క్షేమంగా విడిపించాయి. కేసుల విచారణకు పూర్వం నిందితులను ఉంచే రోస్తోవ్‌-ఆన్‌-డోన్‌ నిర్బంధ కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హతులకు ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు స్థానిక వార్తాసంస్థల్లో కథనాలు వెలువడ్డాయి. ఈ ఆపరేషన్‌లో ఎంతమంది హతమయ్యారన్నది మాత్రం స్పష్టంగా తెలియరాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని