అమెరికాలో కాల్పుల మోత.. ఇద్దరి మృతి

అమెరికాలోని టెక్సాక్‌లో జరిగిన ఓ వేడుకలో కాల్పుల మోత మోగింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందారు. మరికొంత మంది గాయపడ్డారు.

Published : 17 Jun 2024 05:18 IST

టెక్సాక్‌: అమెరికాలోని టెక్సాక్‌లో జరిగిన ఓ వేడుకలో కాల్పుల మోత మోగింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందారు. మరికొంత మంది గాయపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి రౌండ్‌ రాక్‌లోని ఓల్డ్‌ సెట్లర్స్‌ పార్క్‌లో వేడుక నిర్వహించారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య వివాదం చోటుచేసుకోవడంతో ఒక వర్గం వారు మరో వర్గంపై కాల్పులు జరిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి గాయపడిన వారికి అత్యవసర వైద్య సేవలు అందించి స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. కాగా, చనిపోయిన వారు ఈ ఘర్షణతో సంబంధంలేని వారు కావడం గమనార్హం. మరోవైపు, అమెరికాలోని డెట్రాయిట్‌ నగరంలోనూ ఓ వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో తొమ్మిది మంది గాయపడ్డారు. వీరిలో ఎనిమిదేళ్ల బాలుడితో పాటు అతడి తల్లి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. దుండగుడు రెండు తుపాకులు ఉపయోగించి కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు పేర్కొన్నారు. ఈ కేసులో అనుమానితుడైన వ్యక్తి ఇంటికి అధికారులు వెళ్లి చూడగా.. అప్పటికే అతడు తుపాకీతో కాల్చుకుని మృతిచెందాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని