శ్రీలంక - భారత్‌ రోడ్డు నిర్మాణం.. ప్రతిపాదనల అధ్యయనం తుదిదశకు

భారత్, శ్రీలంక మధ్య భూ అనుసంధానం ప్రతిపాదనపై ద్వీపదేశం కీలక ప్రకటన చేసింది. దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలపై చేస్తున్న అధ్యయనం తుదిదశకు చేరుకొన్నట్లు తెలిపింది.

Updated : 17 Jun 2024 06:29 IST

కొలంబో: భారత్, శ్రీలంక మధ్య భూ అనుసంధానం ప్రతిపాదనపై ద్వీపదేశం కీలక ప్రకటన చేసింది. దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలపై చేస్తున్న అధ్యయనం తుదిదశకు చేరుకొన్నట్లు తెలిపింది. మన్నార్‌ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించిన శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే.. ప్రతిపాదిత భూ మార్గం అధ్యయనంపై ప్రాథమిక అంశాలు ముగిశాయని, త్వరలోనే తుదిదశ నివేదిక పూర్తవుతుందన్నారు. ఇరు దేశాల మధ్య పవర్‌గ్రిడ్‌ ప్రతిపాదనపైనా భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్‌తో చర్చించే అవకాశం ఉందని రణిల్‌ విక్రమసింఘే వెల్లడించారు. వీటితోపాటు ట్రింకోమలీ జిల్లాలో పారిశ్రామిక జోన్‌ ఏర్పాటు, మన్నార్‌లో అదానీ గ్రూపునకు చెందిన విండ్‌ పవర్‌ ప్రాజెక్టు సహా శ్రీలంకలో భారత్‌ చేపడుతున్న అన్ని ప్రాజెక్టులపై చర్చించనున్నట్లు శ్రీలంక అధికారులు తెలిపారు. జూన్‌ 20న జైశంకర్‌ శ్రీలంకలో పర్యటించనున్నట్లు ఆ దేశ విదేశాంగశాఖ వెల్లడించింది. అయితే, దీనిపై భారత్‌ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని