ఇజ్రాయెల్‌ యుద్ధ క్యాబినెట్‌ రద్దు!

గాజాలో హమాస్‌తో జరుగుతున్న యుద్ధంలో కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఏర్పాటైన యుద్ధ క్యాబినెట్‌ను ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు సోమవారం రద్దు చేసినట్లు ఇజ్రాయెల్‌ అధికారులు తెలిపారు.

Published : 18 Jun 2024 04:02 IST

టెల్‌ అవీవ్‌: గాజాలో హమాస్‌తో జరుగుతున్న యుద్ధంలో కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఏర్పాటైన యుద్ధ క్యాబినెట్‌ను ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు సోమవారం రద్దు చేసినట్లు ఇజ్రాయెల్‌ అధికారులు తెలిపారు. యుద్ధ క్యాబినెట్‌ నుంచి బెన్నీ గాంట్జ్‌ తప్పుకోవడంతో నెతన్యాహు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతేడాది అక్టోబరు 11న ముగ్గురు సభ్యులతో ఈ క్యాబినెట్‌ ఏర్పాటైంది. ఇందులో నెతన్యాహు, రక్షణ మంత్రి యోయావ్‌ గలాంట్, గాంట్జ్‌ సభ్యులు. ఇప్పుడు దీన్ని రద్దుచేయడంతో ఇక యుద్ధంపై కీలక నిర్ణయాలను నెతన్యాహు తన సన్నిహిత మంత్రులతో చర్చించి తీసుకొనే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని