ఇటలీ తీరంలో పడవ మునక.. 10 మంది వలసదారుల మృతి

ఇటలీ లాంపెడుసా ద్వీపం సమీపంలో సగంవరకూ మునిగిన చెక్క పడవలో పది మంది అనుమానిత వలసదారుల మృతిదేహాల్ని వెలికితీసినట్టు జర్మనీకి చెందిన సహాయక సిబ్బంది తెలిపారు. మృతులంతా పడవ దిగువ భాగంలోని డెక్‌లో చిక్కుకున్నట్టు వారు వెల్లడించారు.

Published : 18 Jun 2024 04:44 IST

51 మందిని రక్షించిన జర్మనీ సహాయక సిబ్బంది 

రోమ్‌: ఇటలీ లాంపెడుసా ద్వీపం సమీపంలో సగంవరకూ మునిగిన చెక్క పడవలో పది మంది అనుమానిత వలసదారుల మృతిదేహాల్ని వెలికితీసినట్టు జర్మనీకి చెందిన సహాయక సిబ్బంది తెలిపారు. మృతులంతా పడవ దిగువ భాగంలోని డెక్‌లో చిక్కుకున్నట్టు వారు వెల్లడించారు. సహాయక చర్యల్లో ఇటలీ తీర గస్తీ దళం కూడా పాల్గొంది. ‘ప్రస్తుతం 51 మందిని రక్షించాం. సకాలంలో చేరలేకపోవడంతో పది మందిని మాత్రం ప్రాణాలతో కాపాడలేకపోయాం’ అని ‘ఎక్స్‌’ వేదిగా జర్మనీ నౌక సిబ్బంది తెలియజేశారు. ‘ప్రమాదానికి గురైన చెక్క పడవలో మొత్తం 61 మంది ప్రయాణిస్తున్నారు. దీని నిండా నీరు చేరింది. మా సిబ్బంది 51 మందిని రక్షించగలిగారు. వారిలో ఇద్దరు స్పృహతప్పి ఉన్నారు’ అని వారు ప్రకటించారు. మరో పడవ ప్రమాదంలో 64 మంది వలసదారులు గల్లంతవగా, ఇటలీ తీర గస్తీ దళం 12 మందిని రక్షించింది. ఇటలీ, గ్రీస్‌ అంతర్జాతీయ సరిహద్దు జలాల్లో సగం వరకూ మునిగిన పడవను అటుగా వెళ్తున్న ఫ్రెంచ్‌ నౌకలోని సిబ్బంది చూసి.. సహాయం కోరుతూ ఇటలీ తీర గస్తీ దళానికి సమాచారం అందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని