చైనా, ఫిలిప్పీన్స్‌ యుద్ధ నౌకల ఢీ

ఎంతో కాలంగా తీవ్ర ఉద్రిక్తతలకు నిలయమైన దక్షిణ చైనా సముద్రంలో సోమవారం ఉదయం అలజడి రేగింది. చైనా, ఫిలిప్పీన్స్‌కు చెందిన రెండు యుద్ధ నౌకలు ఢీకొన్నాయి. ఈ సముద్రంపై పూర్తి హక్కులు తమవేనని, విదేశీ నౌకలకు ప్రవేశం లేదని ఇటీవలే చైనా కొత్త చట్టం తెచ్చిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

Published : 18 Jun 2024 04:45 IST

దక్షిణ చైనా సముద్రంలో అలజడి

బీజింగ్, మనీలా: ఎంతో కాలంగా తీవ్ర ఉద్రిక్తతలకు నిలయమైన దక్షిణ చైనా సముద్రంలో సోమవారం ఉదయం అలజడి రేగింది. చైనా, ఫిలిప్పీన్స్‌కు చెందిన రెండు యుద్ధ నౌకలు ఢీకొన్నాయి. ఈ సముద్రంపై పూర్తి హక్కులు తమవేనని, విదేశీ నౌకలకు ప్రవేశం లేదని ఇటీవలే చైనా కొత్త చట్టం తెచ్చిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. రెండో థామస్‌ షోల్‌వద్ద అక్రమంగా తమ జలాల్లోకి ఫిలిప్పీన్స్‌ నౌక ప్రవేశించిన సమయంలో ఈ ఘటన జరిగిందని చైనా తీర రక్షక దళం ఒక ప్రకటనలో వెల్లడించింది. నిర్మాణ సామగ్రిని తెచ్చి దించుతుండగా తాము అడ్డుకున్న సమయంలో నౌకలు ఢీకొన్నాయని తెలిపింది. తమ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ నౌక ముందుకు వచ్చిందని పేర్కొంది. ఈ ఘటనలో నష్టం గురించి చైనా వివరించలేదు. దక్షిణ చైనా సముద్రంపై చైనాతో ఫిలిప్పీన్స్, మలేసియా, వియత్నాం, బ్రూనై, తైవాన్‌లకు విభేదాలున్నాయి. రెండో థామస్‌ షోల్‌ ప్రాంతంపై తమకే అధికారం ఉందని చైనా, ఫిలిప్పీన్స్‌ ఘర్షణ పడుతున్నాయి. 1999లో ఫిలిప్పీన్స్‌కు చెందిన ఒక నౌక ఈ ప్రాంతంలో తిరగబడిందని, అప్పటి నుంచి ఈ ప్రాంతం తమదేనంటూ ఘర్షణకు దిగుతోందని చైనా అంటోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు