ప్రపంచ 10 ఉత్తమ విద్యాసంస్థల్లో 5 భారతీయ పాఠశాలలు

ప్రపంచవ్యాప్తంగా సమాజ ప్రగతికి సహకారమందించే 10 అత్యుత్తమ పాఠశాలల జాబితాలో భారత్‌కు చెందిన 5 పాఠశాలలు చోటు సంపాదించుకున్నాయి. బ్రిటన్‌లో నిర్వహించే ఈ వార్షిక పోటీల్లో సమాజహితానికి తోడ్పడే పలు అంశాలను ప్రామాణికంగా తీసుకుని ప్రపంచవ్యాప్తంగా అయిదు అత్యుత్తమ పాఠశాలలను ఎంపిక చేసి వాటిని విజేతలుగా ప్రకటిస్తారు.

Published : 18 Jun 2024 04:50 IST

లండన్‌: ప్రపంచవ్యాప్తంగా సమాజ ప్రగతికి సహకారమందించే 10 అత్యుత్తమ పాఠశాలల జాబితాలో భారత్‌కు చెందిన 5 పాఠశాలలు చోటు సంపాదించుకున్నాయి. బ్రిటన్‌లో నిర్వహించే ఈ వార్షిక పోటీల్లో సమాజహితానికి తోడ్పడే పలు అంశాలను ప్రామాణికంగా తీసుకుని ప్రపంచవ్యాప్తంగా అయిదు అత్యుత్తమ పాఠశాలలను ఎంపిక చేసి వాటిని విజేతలుగా ప్రకటిస్తారు. అందులో భాగంగా 2024 సంవత్సరానికిగాను తుదిజాబితాలో 10 పాఠశాలల పేర్లను వెల్లడించగా అందులో భారత్‌కు చెందిన ర్యాన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌(దిల్లీ), సీఎం రైజ్‌ మోడల్‌ పాఠశాలలు(ఝబువా, రత్లాం, మధ్యప్రదేశ్‌), కల్వి ఇంటర్నేషనల్‌ పబ్లిక్‌ స్కూల్‌(మదురై, తమిళనాడు), ఎంపీఎస్‌ ఎల్‌కే వాఘ్జీ ఇంటర్నేషనల్‌(ముంబయి) పాఠశాలలు ఉన్నాయి. యాక్సెంచర్, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్, లెమన్‌ ఫౌండేషన్‌ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ పోటీల్లో ఎంపికైన 10 పాఠశాలలో ఓటింగ్‌ ద్వారా అయిదింటిని నవంబరులో విజేతలుగా ప్రకటించి ఒక్కొక్క పాఠశాలకు 10 వేల డాలర్ల చొప్పున నగదు బహుమతిని అందజేస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని