కొనసాగుతున్న హజ్‌ యాత్ర

హజ్‌ యాత్రలో భాగంగా రెండో రోజైన సోమవారం కూడా మీనాలో సైతానును రాళ్లతో కొట్టే కార్యక్రమం జరిగింది. తెల్లవారుజామునే జమారత్‌ వంతెన దగ్గరకు లక్షల సంఖ్యలో యాత్రికులు చేరుకున్నారు.

Published : 18 Jun 2024 04:51 IST

రెండో రోజూ జమారత్‌కు భారీగా యాత్రికులు

మీనా (సౌదీ అరేబియా): హజ్‌ యాత్రలో భాగంగా రెండో రోజైన సోమవారం కూడా మీనాలో సైతానును రాళ్లతో కొట్టే కార్యక్రమం జరిగింది. తెల్లవారుజామునే జమారత్‌ వంతెన దగ్గరకు లక్షల సంఖ్యలో యాత్రికులు చేరుకున్నారు. గులకరాళ్లతో మూడు రాతి స్తంభాలను కొట్టారు. ఈ స్తంభాలనే సైతానుగా భావిస్తారు. ఎండలు తీవ్రంగా ఉండటంతో ఈ కార్యక్రమాన్ని ఐదు గంటలసేపు (ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో) సౌదీ అధికారులు నిలిపివేశారు. మంగళవారం కూడా రాళ్లతో సైతానును కొట్టే కార్యక్రమం జరుగుతుంది. తర్వాత యాత్రికులు మక్కాకు వస్తారు. కాబా చట్టూ ఏడు సార్లు ప్రదక్షిణ చేస్తారు. యాత్రను ముగిస్తారు. దాదాపు 18 లక్షల మంది ముస్లిం యాత్రికులు ఈ సారి హజ్‌యాత్రకు వచ్చారు. తీవ్రమైన వేసవితాపం నడుమ జరుగుతున్న ఈ యాత్రలో ఒక్క ఆదివారమే 2,760 మంది వడదెబ్బకు గురయ్యారు. 14 మంది మృతి చెందారు. ఆదివారంతో పోలిస్తే సోమవారం యాత్రికుల రద్దీ తగ్గింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని