హెచ్చరిక కాల్పులు జరిపిన దక్షిణ కొరియా సైనికులు

కొద్దిమేర సరిహద్దులు దాటిన ఉత్తరకొరియా సైనికులను నిలువరించేందుకు మంగళవారం దక్షిణ కొరియా సైనికులు హెచ్చరిక కాల్పులు జరిపారు.

Published : 19 Jun 2024 05:22 IST

సియోల్‌: కొద్దిమేర సరిహద్దులు దాటిన ఉత్తరకొరియా సైనికులను నిలువరించేందుకు మంగళవారం దక్షిణ కొరియా సైనికులు హెచ్చరిక కాల్పులు జరిపారు. ఇలా జరగడం ఈ నెలలో ఇది రెండోసారని దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. అయితే రెండుసార్లు జరిగిన సరిహద్దు ఉల్లంఘనలు ఉద్దేశపూర్వకమైనవి కావని భావిస్తున్నారు. ఇరు దేశాల సరిహద్దు వద్ద నిర్మాణ పనులు నిర్వహిస్తున్న 20 నుంచి 30 మంది ఉత్తర కొరియా సైనికులు సైనిక సరిహద్దు రేఖను దాటారు. దీంతో దక్షిణ కొరియా జరిపిన హెచ్చరిక కాల్పులతో వారంతా తిరిగి తమ భూభాగంలోకి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఉత్తరకొరియా సైనికులు ఎటువంటి అనుమానాస్పద చర్యలకు పాల్పడలేదని దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని