వేదికపై బిగుసుకుపోయిన బైడెన్‌.. చేయందించి బయటకు తీసుకెళ్లిన ఒబామా!

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆరోగ్యం, వయోభార సమస్యల గురించి తరచూ చర్చ జరుగుతోంది. పలుమార్లు ఆయన వింతగా ప్రవర్తించడమే అందుకు కారణం.

Updated : 19 Jun 2024 06:25 IST

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆరోగ్యం, వయోభార సమస్యల గురించి తరచూ చర్చ జరుగుతోంది. పలుమార్లు ఆయన వింతగా ప్రవర్తించడమే అందుకు కారణం. దారితప్పడం, గందగరోళ చూపులు, వేదికపై ఆగిపోవడం వంటి ఉదంతాలు అందుకు ఉదాహరణ. తాజాగా మరోసారి అదే తరహా ఘటన జరిగింది. ఆ సమయంలో అక్కడే ఉన్న మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఆయనకు సాయంగా నిలిచారు. లాస్‌ ఏంజెలెస్‌లో శనివారం డెమోక్రటిక్‌ పార్టీ విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహించింది. దీంట్లో బైడెన్, ఒబామా పాల్గొన్నారు. వారిద్దరినీ జిమ్మీ కిమ్మెల్‌ దాదాపు 45 నిమిషాల పాటు ఇంటర్వ్యూ చేశారు. ఆ తర్వాత ఒబామా వేదిక దిగి వెళ్లేందుకు సిద్ధమై ముందుకు కదిలారు. బైడెన్‌ మాత్రం ఎటూ పాలుపోనట్లు ఓ పది సెకన్ల పాటు ఉన్నచోటే బిగుసుకుపోయినట్లు ఉండిపోయారు. పరిస్థితిని అర్థం చేసుకున్న ఒబామా.. బైడెన్‌ను చేయి పట్టుకుని అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని