అమెరికాను అల్లాడిస్తున్న ఎండలు

భారత్‌లోనే కాదు అమెరికాలోనూ ఎండలు మండిపోతున్నాయి. అమెరికాలో సోమవారం 7.5 కోట్ల మందికి హీట్‌ వేవ్‌ హెచ్చరికలు జారీ అయ్యాయి.

Published : 19 Jun 2024 05:23 IST

వాషింగ్టన్‌: భారత్‌లోనే కాదు అమెరికాలోనూ ఎండలు మండిపోతున్నాయి. అమెరికాలో సోమవారం 7.5 కోట్ల మందికి హీట్‌ వేవ్‌ హెచ్చరికలు జారీ అయ్యాయి. మంగళవారం షికాగో సహా పలు నగరాలు భానుడి తాపానికి అల్లాడిపోయాయి. షికాగోలో సోమవారం 36.1 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ వారం 37.7 డిగ్రీలను కూడా చవిచూసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫినీక్స్‌ పట్టణంలో శనివారం 44.4 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. నిరుడు ఇక్కడ ఉష్ణ తాపానికి 645 మంది మరణించారు. జనం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్యలో బయట తిరిగే సమయాన్ని సాధ్యమైనంత మేర తగ్గించుకోవాలని వాతావరణ శాస్త్రవేత్త టెడ్‌ విట్‌ లాక్‌ సూచించారు. ఫినీక్స్‌ పట్టణంలో 100 శీతల కేంద్రాలను తెరిచారు. పొరుగునే ఉన్న రాస్‌వెల్‌లో సోమవారం ఉష్ణోగ్రత 41.6 డిగ్రీల సెల్సియస్‌ను తాకింది. దక్షిణ కొలరాడో రాష్ట్రంలో ఉష్ణోగ్రత 37.7 డిగ్రీలకు చేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని