థాయ్‌లాండ్‌ మాజీ ప్రధానికి బెయిలు

థాయ్‌లాండ్‌ రాజు దివంగత భూమిబల్‌ అతుల్య తేజ్‌ను అగౌరవపరిచారని మంగళవారం అభియోగం దాఖలైన కొన్ని గంటల్లోనే మాజీ ప్రధానమంత్రి తక్సిన్‌ షినవాత్రా (74) బెయిలుపై విడుదలయ్యారు.

Published : 19 Jun 2024 05:23 IST

బ్యాంకాక్‌: థాయ్‌లాండ్‌ రాజు దివంగత భూమిబల్‌ అతుల్య తేజ్‌ను అగౌరవపరిచారని మంగళవారం అభియోగం దాఖలైన కొన్ని గంటల్లోనే మాజీ ప్రధానమంత్రి తక్సిన్‌ షినవాత్రా (74) బెయిలుపై విడుదలయ్యారు. థాయ్‌ రాజు 2016లో మరణించారు. అంతకుముందు సంవత్సరం దక్షిణ కొరియా పాత్రికేయులకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజును ఉద్దేశించి తక్సిన్‌ అమర్యాదరకర వ్యాఖ్యలు చేశారని ప్రాసిక్యూషన్‌ ఆరోపించింది. తనపై రాజకీయ దురుద్దేశాలతో కేసులు బనాయించారంటూ తక్సిన్‌ 2008 నుంచే ప్రవాసంలోకి వెళ్లారు. 2006లో ఆయన ప్రభుత్వాన్ని కూలదోయడం జరిగింది. తక్సిన్‌ నిరుడు స్వచ్ఛందంగా థాయ్‌లాండ్‌కు తిరిగివచ్చారు. వైద్య కారణాలపై ఆసుపత్రిలో చేరి తనపై వచ్చిన అవినీతి కేసులన్నింటికీ ఆసుపత్రి పడకపైనే శిక్ష అనుభవించి ఫిబ్రవరిలో పెరోల్‌పై విడుదలయ్యారు. రాజును అగౌరవపరిచారనే కేసులో తక్సిన్‌ మంగళవారం ఉదయం క్రిమినల్‌ కోర్టులో హాజరయ్యారు. 13,000 డాలర్ల బాండుపై బెయిలు పొందారు. కోర్టు అనుమతిలేకుండా దేశం విడచి వెళ్లరాదంటూ ఆయన పాస్‌పోర్ట్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాజరికాన్ని అగౌరవపరిచినట్లు రుజువైతే 15 ఏళ్ల జైలు శిక్ష విధిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని