పిండంలో పెద్ద మెదడు.. తీవ్ర ఆటిజానికి సూచిక!

మొదటి త్రైమాసికంలో గర్భస్థ శిశువు మెదడులోని గ్రే మ్యాటర్‌ చాలా ఎక్కువగా ఉంటే అది తీవ్ర ఆటిజానికి సంకేతం కావొచ్చని అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. జన్మించాక అలాంటి చిన్నారికి సామాజిక, విషయగ్రహణ సామర్థ్యం పరంగా జీవితకాలం పాటు ఇబ్బందులు ఎదురవుతాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

Published : 20 Jun 2024 06:28 IST

దిల్లీ: మొదటి త్రైమాసికంలో గర్భస్థ శిశువు మెదడులోని గ్రే మ్యాటర్‌ చాలా ఎక్కువగా ఉంటే అది తీవ్ర ఆటిజానికి సంకేతం కావొచ్చని అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. జన్మించాక అలాంటి చిన్నారికి సామాజిక, విషయగ్రహణ సామర్థ్యం పరంగా జీవితకాలం పాటు ఇబ్బందులు ఎదురవుతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. వారు మాట్లాడటమూ కష్టం కావొచ్చని చెప్పారు. ఒక మోస్తరుస్థాయి, తీవ్ర ఆటిజానికి సంబంధించిన బీజాలు.. పిండం ఏర్పడిన కొద్దివారాలకే పడతాయని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ అధ్యయనం కోసం పరిశోధకులు ఆటిజం ఉన్న పది మంది చిన్నారుల నుంచి, ఆ రుగ్మత లేని ఆరుగురు పిల్లల నుంచి రక్త నమూనాలు సేకరించారు. వాటి నుంచి మూల కణాలను తీసుకున్నారు. వాటి సాయంతో మెదడులోని సెరిబ్రల్‌ కార్టెక్స్‌ నమూనాలను వృద్ధి చేశారు. అవి.. ఆ చిన్నారుల పిండస్థ దశ నాటి మెదడు భాగాన్ని ప్రతిబింబించాయి. ఈ మినీ మెదళ్లను బ్రెయిన్‌ కార్టికల్‌ ఆర్గానాయిడ్స్‌ (బీసీవో)గా పిలుస్తారు. ఆటిజమ్‌ ఉన్న పిల్లల మూలకణాలతో వృద్ధి చేసిన బీసీవోలు.. మిగతావారి కన్నా 40 శాతం పెద్దగా ఉన్నాయని గుర్తించారు. ‘‘మెదడు ఎంత పెద్దగా ఉంటే అంత ప్రయోజనం ఉంటుందన్నది నిజం కాదు’’ అని పరిశోధనకు నాయకత్వం వహించిన అలీసన్‌ తెలిపారు. తీవ్రస్థాయి ఆటిజం ఉన్న పిల్లలు పిండస్థ దశలో చాలా పెద్ద బీసీవోలను కలిగి ఉన్నారని, ఒక మోస్తరు స్థాయిలో ఉన్నవారికి ఆ పెరుగుదల స్వల్పంగానే ఉన్నట్లు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు