పక్షవాతాన్ని పసిగట్టే ముఖ గుర్తింపు సాధనం

పక్షవాతం బారినపడిన వారిని కొన్ని సెకన్లలోనే గుర్తించే ఒక స్మార్ట్‌ఫోన్‌ యాప్‌ను ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది పారామెడికల్‌ సిబ్బందికి బాగా ఉపయోగపడుతుంది. 82 శాతం కచ్చితత్వంతో ఫలితాన్ని చెబుతుందని పరిశోధకులు తెలిపారు.

Published : 20 Jun 2024 05:50 IST

దిల్లీ: పక్షవాతం బారినపడిన వారిని కొన్ని సెకన్లలోనే గుర్తించే ఒక స్మార్ట్‌ఫోన్‌ యాప్‌ను ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది పారామెడికల్‌ సిబ్బందికి బాగా ఉపయోగపడుతుంది. 82 శాతం కచ్చితత్వంతో ఫలితాన్ని చెబుతుందని పరిశోధకులు తెలిపారు. 

ఈ సాధనం.. కృత్రిమ మేధ (ఏఐ)తో పనిచేస్తుంది. ఇది ముఖం తీరుతెన్నులను, కండరాల కదలికలను విశ్లేషించి, ఆ వ్యక్తి పక్షవాతం బారినపడ్డాడా అన్నది గుర్తిస్తుంది. ఈ రుగ్మత బాధితుల్లో గందరగోళం, కండరాల కదలికలపై నియంత్రణ లేకపోవడం, మాటల్లో స్పష్టత లోపించడం, ముఖకవళికలు తగ్గిపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. ముఖ్యంగా ముఖంలోని రెండు పార్శ్వాల మధ్య తేడాలు కనిపిస్తాయి. పక్షవాతాన్ని సాధ్యమైనంత త్వరగా గుర్తించడం చాలా ముఖ్యం. సకాలంలో చికిత్స అందిస్తే దీర్ఘకాల వైకల్యం ముప్పును, ప్రాణాపాయాన్ని తగ్గించుకోవచ్చు. పక్షవాతం కేసుల్లో 13 శాతాన్ని అత్యవసర విభాగాలు, పెద్ద ఆసుపత్రుల్లోనూ గుర్తించలేకపోతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. చిన్నస్థాయి ఆసుపత్రుల్లో ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటోందని తెలిపాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని