ఎర్ర సముద్రంలో మునిగిన వాణిజ్య నౌక

గత వారం హూతీ రెబల్స్‌ దాడి చేసిన వాణిజ్య నౌక ఎర్ర సముద్రంలో మునిగిపోయింది. లైబీరియా జెండాతో ఉన్న ఈ నౌక గ్రీస్‌కు చెందినది. ట్యూటర్‌ అనే ఈ నౌక చివరిసారిగా కనిపించిన ప్రాంతంలో శిథిలాలతోపాటు చమురు ఆనవాళ్లు కనిపించాయని, దీనినిబట్టి నౌక మునిగి ఉంటుందని భావిస్తున్నామని బ్రిటీష్‌ మిలిటరీ విభాగం బుధవారం వెల్లడించింది.

Published : 20 Jun 2024 05:51 IST

వారం క్రితం హూతీ రెబల్స్‌ దాడి

దుబాయ్‌: గత వారం హూతీ రెబల్స్‌ దాడి చేసిన వాణిజ్య నౌక ఎర్ర సముద్రంలో మునిగిపోయింది. లైబీరియా జెండాతో ఉన్న ఈ నౌక గ్రీస్‌కు చెందినది. ట్యూటర్‌ అనే ఈ నౌక చివరిసారిగా కనిపించిన ప్రాంతంలో శిథిలాలతోపాటు చమురు ఆనవాళ్లు కనిపించాయని, దీనినిబట్టి నౌక మునిగి ఉంటుందని భావిస్తున్నామని బ్రిటీష్‌ మిలిటరీ విభాగం బుధవారం వెల్లడించింది. హూతీ రెబల్స్‌ దాడి కారణంగా సముద్రంలో నౌక మునగడం ఇది రెండోసారి. గతంలోనూ ఒకటి ఇలాగే మునిగిపోయింది. ఇజ్రాయెల్, హమాస్‌ యుద్ధం నేపథ్యంలో కొన్ని నెలలుగా ఎర్ర సముద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా, హూతీల దాడులు, ప్రతిదాడులతో ఈ ప్రాంతం దద్దరిల్లుతోంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వాణిజ్య, యుద్ధ నౌకలను లక్ష్యంగా చేసుకునిదాడులు చేసుకోవడం ఇదే తొలిసారి. ట్యూటర్‌ నౌకపై వారం కిందట బాంబులను నింపుకొని వచ్చిన హూతీలకు చెందిన డ్రోన్‌ బోట్‌ దాడి చేసింది. ఈ ఘటనలో ఫిలిప్పీన్స్‌కు చెందిన ఒక నౌకలోని ఉద్యోగి మరణించారు. 

యెమెన్‌పై అమెరికా దాడి

యెమెన్‌లో హూతీల ప్రాబల్యమున్న ప్రాంతాలపై బుధవారం అమెరికా దాడులు చేసింది. రేమా ప్రావిన్సులోని హూతీలకు చెందిన సబా న్యూస్‌ ఏజెన్సీ భవనాన్ని ధ్వంసం చేసింది. మరోవైపు 8 హూతీల డ్రోన్లను యెమెన్‌లోనే ధ్వంసం చేశామని అమెరికా సైన్యం ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు