నాటో సెక్రటరీ జనరల్‌గా మార్క్‌ రుట్టె!

నెదర్లాండ్స్‌ నేత మార్క్‌ రుట్టె.. నాటో కూటమి సెక్రటరీ జనరల్‌గా ఎన్నిక కానున్నారు. ఈ పదవి కోసం పోటీపడ్డ రుమేనియా అధ్యక్షుడు క్లాస్‌ యెహానిస్‌.. బరి నుంచి వైదొలుగుతున్నట్లు గురువారం ప్రకటించారు.

Published : 21 Jun 2024 06:11 IST

ద హేగ్‌: నెదర్లాండ్స్‌ నేత మార్క్‌ రుట్టె.. నాటో కూటమి సెక్రటరీ జనరల్‌గా ఎన్నిక కానున్నారు. ఈ పదవి కోసం పోటీపడ్డ రుమేనియా అధ్యక్షుడు క్లాస్‌ యెహానిస్‌.. బరి నుంచి వైదొలుగుతున్నట్లు గురువారం ప్రకటించారు. దీంతో రుట్టె ఒక్కరే పోటీలో మిగిలారు. ఆయన ఎన్నిక లాంఛనమే. ఆయన ప్రస్తుతం నెదర్లాండ్స్‌కు ఆపద్ధర్మ ప్రధానిగా ఉన్నారు. కొద్దిరోజుల్లో జరిగే నాటో రాయబారుల సమావేశంలో లేదా జులై 9-11 మధ్య వాషింగ్టన్‌లో జరగనున్న కూటమి శిఖరాగ్ర సదస్సులో రుట్టె నియామకానికి ఆమోదముద్ర పడనుంది. అక్టోబరు నుంచి ఆయన బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని