కెనడా ఉగ్ర జాబితాలో ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌ కోర్‌

ఉగ్రవాదాన్ని ఎగదోస్తోందన్న ఆరోపణలపై ఇరాన్‌లోని ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కోర్‌ (ఐఆర్‌జీసీ)ను కెనడా తమ దేశ ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది.

Published : 21 Jun 2024 06:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉగ్రవాదాన్ని ఎగదోస్తోందన్న ఆరోపణలపై ఇరాన్‌లోని ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కోర్‌ (ఐఆర్‌జీసీ)ను కెనడా తమ దేశ ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది. దీనిని ఇరాన్‌ తీవ్రంగా ఖండించింది. కెనడా నిర్ణయం ఐఆర్‌జీసీ చట్టనిబద్ధత, సామర్థ్యంపై ఎలాంటి ప్రభావం చూపదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నాజర్‌ కనానీ పేర్కొన్నారు. కెనడా నిర్ణయాన్ని తెలివితక్కువ, రాజకీయ ప్రేరేపిత కుట్రపూరిత చర్యగా అభివర్ణించారు. 2019లోనే అమెరికా ఐఆర్‌జీసీని ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని