శ్రీలంక అధ్యక్షుడితో జైశంకర్‌ చర్చలు

భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ గురువారం కొలంబోలో పర్యటించారు. అక్కడ శ్రీలంక అధ్యక్షుడు, ప్రధానిలతోపాటు ప్రతిపక్ష నాయకులను కలిసి ద్వైపాక్షిక సహకారం దిశగా చర్చలు జరిపారు.

Published : 21 Jun 2024 06:11 IST

కొలంబో: భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ గురువారం కొలంబోలో పర్యటించారు. అక్కడ శ్రీలంక అధ్యక్షుడు, ప్రధానిలతోపాటు ప్రతిపక్ష నాయకులను కలిసి ద్వైపాక్షిక సహకారం దిశగా చర్చలు జరిపారు. భారత్‌ అందించిన రూ.50 కోట్లతో సముద్ర రక్షణ సమన్వయ కేంద్ర నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టు కింద శ్రీలంక నౌకాదళ ప్రధాన కార్యాలయంలో సమన్వయ కేంద్రాన్నీ, హంబన్‌తోటలో ఉప కేంద్రం, ట్రింకోమలీతో సహా ఏడు చోట్ల మానవ రహిత సహాయ, నిఘా కేంద్రాలను నిర్మిస్తారు. శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘెతో ఇంధనం, విద్యుత్, రేవులు, అనుసంధానత, పౌర విమానయానం, డిజిటల్‌ రంగం, ఆరోగ్యం, విద్య, ఆహార భద్రత, పర్యాటక రంగాల్లో సహకారానికి జైశంకర్‌ చర్చలు జరిపారు. శ్రీలంకకు అభివృద్ధి, అనుసంధానతలలో భారత్‌ సహాయం అందిస్తుందని ఆ దేశ ప్రధాని దినేశ్‌ గుణవర్థనేతో జరిపిన సమావేశంలో జైశంకర్‌ భరోసా ఇచ్చారు. ఆయన ప్రతిపక్ష నాయకులనూ కలిసి ద్వైపాక్షిక సహకారానికి పాలక, ప్రతిపక్షాలు కట్టుబడి ఉన్నందుకు అభినందనలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో శ్రీలంకను సందర్శించనున్న నేపథ్యంలో తగు ఏర్పాట్లు చేయడానికి జైశంకర్‌ కొలంబో వచ్చారు. ఈ నెల 9న మోదీ ప్రమాణస్వీకారానికి హాజరైన నాయకుల్లో లంక అధ్యక్షుడు విక్రమసింఘె కూడా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని