గల్వాన్‌ తరహా దాడికి పాల్పడిన చైనా

గల్వాన్‌ లోయ వద్ద భారత సైనికులపై పదునైన ఆయుధాలతో దారుణంగా దాడి చేసిన విధంగానే చైనా సైనికులు మరోసారి అటువంటి దాడికి పాల్పడ్డారు.

Updated : 21 Jun 2024 06:40 IST

ఈసారి బాధిత దేశం ఫిలిప్పీన్స్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: గల్వాన్‌ లోయ వద్ద భారత సైనికులపై పదునైన ఆయుధాలతో దారుణంగా దాడి చేసిన విధంగానే చైనా సైనికులు మరోసారి అటువంటి దాడికి పాల్పడ్డారు. ఇప్పుడు దక్షిణ చైనా సముద్రంలో బీజింగ్‌ కోస్ట్‌ గార్డు మూకలు ఫిలిప్పీన్స్‌ నేవీపై దాడికి దిగాయి. దీనికి సంబంధించిన వీడియోను గురువారం ఫిలిప్పీన్స్‌ విడుదల చేసింది. అందులో చైనా బలగాలు ఫిలిప్పీన్స్‌ పడవలను కత్తులు, గొడ్డళ్లు, సుత్తులతో ధ్వంసం చేయడానికి యత్నించాయి. ఈ ఘటనలో ఫిలిప్పీన్స్‌ దళాల్లోని పలువురు గాయపడ్డారు. ఒక సైనికుడి బొటనవేలు తెగిపోయింది. ఈ ఘటన ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచింది. దీనిపై ఫిలిప్పీన్స్‌ అధికారులు స్పందిస్తూ.. తమ నౌకాదళానికి చెందిన రెండు బోట్లు సెకండ్‌ థామస్‌ షోల్‌కు ఆహారం, ఇతర వస్తువులను తీసుకెళ్తుండగా చైనా దళాలు దాడి చేసినట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని