వాయు కాలుష్యం క్యాన్సర్‌ రోగులకు ప్రాణాంతకం

క్యాన్సర్‌ రోగులకు వాయు కాలుష్యం వల్ల హృద్రోగాలు, మృత్యు ప్రమాదం పెరుగుతాయని కొత్త పరిశోధన తేల్చింది. 2000-2023 మధ్య కాలంలో 1.1 కోట్ల మందిపై జరిగిన ఎనిమిది పరిశోధనలు ఈ ప్రమాదం గురించి హెచ్చరించాయి.

Published : 21 Jun 2024 06:11 IST

దిల్లీ: క్యాన్సర్‌ రోగులకు వాయు కాలుష్యం వల్ల హృద్రోగాలు, మృత్యు ప్రమాదం పెరుగుతాయని కొత్త పరిశోధన తేల్చింది. 2000-2023 మధ్య కాలంలో 1.1 కోట్ల మందిపై జరిగిన ఎనిమిది పరిశోధనలు ఈ ప్రమాదం గురించి హెచ్చరించాయి. పీఎం 2.5 కాలుష్య కణాలను శరీరం త్వరగా బయటకు పంపలేదు. దీనికి కణజాల వాపు తోడైతే క్యాన్సర్, హృద్రోగాలు వస్తాయి. వాయు కాలుష్యం విషతుల్య కణాలను ప్రవేశపెట్టడంతోపాటు, కణజాల వాపునూ కలిగించి శరీరానికి హాని చేస్తుందని చైనా శాస్త్రజ్ఞులు తెలిపారు. క్యాన్సర్‌ రోగులు వాయు కాలుష్యానికి స్వల్పంగానే గురైనా వారి గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. అల్పాదాయ, మధ్యాదాయ దేశాల్లో వాయు కాలుష్యం వల్ల మరణాలు 100 రెట్లు ఎక్కువగా సంభవిస్తున్నాయి. ప్రపంచంలో క్యాన్సర్‌ మరణాల్లో 65 శాతం, హృదయ రక్తనాళ వ్యాధుల వల్ల మరణాల్లో 70 శాతం ఈ దేశాల్లోనే సంభవిస్తున్నాయి. కాబట్టి వాయు కాలుష్య కట్టడికి ప్రాధాన్యమివ్వడం తక్షణావసరమని పరిశోధకులు సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని