ఉక్రెయిన్‌కు ఆయుధాలిచ్చి తప్పు చేయకండి

ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేయాలన్న నిర్ణయం తీసుకుంటే అది దక్షిణ కొరియా చేసే అతి పెద్ద తప్పిదం అవుతుందని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ హెచ్చరించారు.

Published : 22 Jun 2024 05:21 IST

దక్షిణ కొరియాకు పుతిన్‌ హెచ్చరిక

మాస్కో: ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేయాలన్న నిర్ణయం తీసుకుంటే అది దక్షిణ కొరియా చేసే అతి పెద్ద తప్పిదం అవుతుందని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ హెచ్చరించారు. వియత్నాంలో రెండు రోజుల పర్యటనలో ఉన్న పుతిన్‌.. ఈ వ్యాఖ్యలు చేశారు. బుధవారం రష్యా, ఉత్తర కొరియా నూతన సైనిక ఒప్పందంపై సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై దక్షిణ కొరియా మండిపడింది. మాస్కోపై పోరాడేందుకు ఉక్రెయిన్‌కు ఆయుధాలు అందజేస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పుతిన్‌ మాట్లాడుతూ.. ‘‘మా సైనిక ఒప్పందంపై దక్షిణ కొరియా ఆందోళన చెందాల్సిన పనిలేదు. సంతకాలు చేసిన దేశాల్లో ఒక దానిపై దాడి చేసినపుడు మాత్రమే మా ఒప్పందం అమల్లోకి వస్తుంది. నాకు తెలిసినంత వరకు ఉత్తరకొరియాపై దాడి చేయాలని దక్షిణ కొరియా అనుకోవడం లేదు. ఉక్రెయిన్‌కు ఆయుధ సరఫరాల విషయానికొస్తే, అది పెద్ద తప్పిదం అవుతుంది. అది జరగదనే భావిస్తున్నా. జరిగితే మేం కూడా అందుకు తగ్గట్టు నిర్ణయాలు తీసుకుంటాం. అవి ప్రస్తుత దక్షిణ కొరియా నాయకత్వానికి ఏమాత్రం రుచించవు’’ అని పుతిన్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని