ఉగ్రవాది కోసం ఒక నిమిషం మౌనం పాటిస్తారా?

ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌సింగ్‌ నిజ్జర్‌ మృతికి సంతాపంగా కెనడా పార్లమెంటు ఒక నిమిషం మౌనం పాటించడంపై భారత్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Published : 22 Jun 2024 05:21 IST

కెనడా వైఖరిని తప్పుపట్టిన భారత్‌

దిల్లీ: ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌సింగ్‌ నిజ్జర్‌ మృతికి సంతాపంగా కెనడా పార్లమెంటు ఒక నిమిషం మౌనం పాటించడంపై భారత్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘హింసను ప్రేరేపించే శక్తులకు రాజకీయ వేదిక ఇవ్వడాన్ని మేం సహజంగానే వ్యతిరేకిస్తాం’’ అని శుక్రవారం విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ పేర్కొన్నారు. గతేడాది జూన్‌లో హత్యకు గురైన నిజ్జర్‌కు అనూహ్యంగా రెండు రోజుల క్రితం కెనడా పార్లమెంటు నివాళి అర్పించింది. నిజ్జర్‌ హత్య వెనక భారత్‌ ఏజెంట్లు ఉన్నారని గతేడాది సెప్టెంబరులో కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఆరోపించినప్పటి నుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ట్రూడో ఆరోపణలను భారత్‌ ఖండించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని