ఖలిస్థానీ ఉగ్రవాదులకు ఎదురుదెబ్బ

తమను ‘నో ఫ్లై’ జాబితా నుంచి తొలగించాలని కోరుతూ ఇద్దరు ఖలిస్థానీ ఉగ్రవాదులు వేసిన పిటిషన్లను కెనడా కోర్టు తిరస్కరించింది.

Published : 22 Jun 2024 05:22 IST

- ‘నో ఫ్లై’ జాబితా నుంచి తొలగించాలన్న అభ్యర్థన తిరస్కరణ  

ఒట్టావా: తమను ‘నో ఫ్లై’ జాబితా నుంచి తొలగించాలని కోరుతూ ఇద్దరు ఖలిస్థానీ ఉగ్రవాదులు వేసిన పిటిషన్లను కెనడా కోర్టు తిరస్కరించింది. ఉగ్రవాద చర్యలకు పాల్పడవచ్చనే కారణాలు ఉన్నాయంటూ పేర్కొంటూ వారి అభ్యర్థనను తోసిపుచ్చింది. నిఘా వర్గాల సమాచారం మేరకు భగత్‌సింగ్‌ బ్రార్, పర్వాకర్‌ సింగ్‌ దులైలను కెనడా ప్రభుత్వం గతంలో ‘నో ఫ్లై’ జాబితాలో చేర్చింది. దీనిపై వారు కెనడాలోని ఫెడరల్‌ కోర్ట్‌ ఆఫ్‌ అప్పీల్‌కు వెళ్లగా.. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ ఆ కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. పర్వాకర్‌ సింగ్‌ దులై నిషేధిత బబ్బర్‌ ఖల్సా సభ్యుడని, అతడు సర్రేలో ఛానెల్‌ పంజాబీని, చంఢీగడ్‌లో గ్లోబల్‌ టీవీలను నిర్వహిస్తూ ఖలిస్థానీ వాదాన్ని ప్రచారం చేస్తున్నట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని