మా క్షిపణులను రష్యాపై దాడికీ వాడొచ్చు

అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు సరఫరా చేసిన ఆయుధాలను తమ భూభాగంపై వాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రష్యా హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది.

Published : 22 Jun 2024 05:22 IST

- ఉక్రెయిన్‌కు అమెరికా అనుమతి

వాషింగ్టన్‌: అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు సరఫరా చేసిన ఆయుధాలను తమ భూభాగంపై వాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రష్యా హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఆత్మరక్షణార్థం తాము సరఫరా చేసిన సుదీర్ఘశ్రేణి క్షిపణులను రష్యా భూభాగంలో దాడికి ఉక్రెయిన్‌ వినియోగించొచ్చని పేర్కొంది. ఖార్కివ్‌ ప్రాంతంలో దాడులు అడ్డుకొనేందుకు తమ క్షిపణులను వాడుకోవడానికి తొలుత అనుమతినిచ్చిన అమెరికా.. ఇప్పుడు రష్యాలోని ఏ ప్రాంతంపై దాడికైనా వినియోగించుకోవచ్చని తెలిపింది. రష్యా భూభాగంలో తిరిగే యుద్ధ విమానాలపైనా తాము సరఫరా చేసిన గగనతల రక్షణ వ్యవస్థలను వాడొచ్చని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని