పక్షవాతానికి సరికొత్త విరుగుడు!

మానవుల్లో ప్రత్యేకమైన ఒక తెల్లరక్త కణాన్ని అమెరికాలోని ఒహాయో స్టేట్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు గుర్తించారు. నాడుల ఫైబర్లను తిరిగి వృద్ధి చేసే సామర్థ్యం దీనికి ఉందని తేల్చారు.

Published : 22 Jun 2024 05:23 IST

కొలంబస్‌: మానవుల్లో ప్రత్యేకమైన ఒక తెల్లరక్త కణాన్ని అమెరికాలోని ఒహాయో స్టేట్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు గుర్తించారు. నాడుల ఫైబర్లను తిరిగి వృద్ధి చేసే సామర్థ్యం దీనికి ఉందని తేల్చారు. ఫలితంగా పక్షవాతం, నాడీ సంబంధ వ్యాధులున్నవారికి చికిత్స చేసేందుకు ఇది వీలు కల్పిస్తుందని వారు పేర్కొన్నారు. చనిపోయిన నాడీ కణాల స్థానంలో కొత్తవి ఉత్పన్నం కావు. దెబ్బతిన్న నాడుల ఫైబర్లు సాధారణంగా తిరిగి వృద్ధి చెందవు. ఫలితంగా నాడీ సంబంధ వైకల్యాలు శాశ్వతంగా ఉండిపోతుంటాయి. ఎముక మజ్జ కణాలను శక్తిమంతమైన చికిత్స సాధనాలుగా మార్పు చేయవచ్చని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. ల్యాబ్‌లో నిర్దిష్ట పరమాణువులతో ప్రేరేపిస్తే అవి  పునరుజ్జీవానికి వీలుకల్పించే కణాలుగా రూపాంతరం చెందుతాయని వివరించారు. దెబ్బతిన్న నాడీ కణాలు మనుగడ సాగించేలా, తిరిగి వృద్ధి చెందేలా అవి సాయపడతాయని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని