నిరాశ్రయుల గుడారాలపై ఇజ్రాయెల్‌ భీకర దాడులు

గాజాలో ఇజ్రాయెల్‌ బలగాల భీకర దాడులు కొనసాగుతున్నాయి. రఫా నగరానికి ఉత్తరాన నిరాశ్రయ పాలస్తీనియన్లు ఏర్పాటుచేసుకున్న గుడారాలపై అవి శుక్రవారం షెల్‌లతో విరుచుకుపడ్డాయి.

Published : 22 Jun 2024 05:23 IST

25 మంది దుర్మరణం, 50 మందికి గాయాలు 

క్షిపణి దాడి అనంతరం గుడారాల నుంచి భారీగా వెలువడుతున్న పొగ 

దేర్‌ అల్‌-బలా: గాజాలో ఇజ్రాయెల్‌ బలగాల భీకర దాడులు కొనసాగుతున్నాయి. రఫా నగరానికి ఉత్తరాన నిరాశ్రయ పాలస్తీనియన్లు ఏర్పాటుచేసుకున్న గుడారాలపై అవి శుక్రవారం షెల్‌లతో విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో  25 మంది మృత్యువాతపడ్డారని, మరో 50 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. సురక్షిత జోన్‌గా ఇజ్రాయెల్‌ ప్రకటించిన ప్రాంతానికి అత్యంత చేరువగా తాజా దాడులు జరిగినట్లు తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని