గ్రాడ్యుయేట్‌ అయితే నేరుగా గ్రీన్‌ కార్డు

అమెరికా కళాశాలల నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన విదేశీ విద్యార్థులకు నేరుగా గ్రీన్‌కార్డు ఇవ్వాలని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రతిపాదించారు.

Published : 22 Jun 2024 05:24 IST

ట్రంప్‌ అనూహ్య ప్రతిపాదన!

వాషింగ్టన్‌: అమెరికా కళాశాలల నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన విదేశీ విద్యార్థులకు నేరుగా గ్రీన్‌కార్డు ఇవ్వాలని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రతిపాదించారు. కంపెనీలు విదేశాల నుంచి ప్రతిభావంతులను నియమించుకోవడంపై మీ ప్రణాళికలేంటని ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు ఆయన ఈవిధంగా సమాధానమిచ్చారు. ‘కళాశాలల నుంచి గ్రాడ్యుయేట్‌ కాగానే ఈ దేశంలో ఉండేందుకు వీలుగా డిప్లొమాతో పాటే నేరుగా గ్రీన్‌ కార్డు ఇవ్వాలి. అది రెండేళ్లు.. నాలుగేళ్లు.. ఇలా విద్యాభ్యాసం వ్యవధితో సంబంధం లేదు. జూనియర్‌ కళాశాలలకూ దీన్ని వర్తింపజేయాలి. అధికారంలోకి వచ్చిన తొలిరోజే దీనిపై దృష్టి సారిస్తాను. కరోనా కారణంగా గతంలో ఈ విధానాన్ని అమలు చేయలేకపోయాను. వీసా సమస్యల వల్ల భారత్, చైనా వంటి దేశాల నుంచి వస్తున్న చాలామంది ఇక్కడ ఉండలేకపోతున్నారు. వారంతా సొంత దేశాలకు వెళ్లి వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ప్రపంచంలోని తెలివైన వ్యక్తులను అమెరికాలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది’ అని ట్రంప్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని