‘కనిష్క బాంబు దాడి’ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది!

ఎయిర్‌ ఇండియా విమానం ‘కనిష్క ఫ్లైట్‌ 182’పై బాంబు దాడికి సంబంధించిన దర్యాప్తు చురుగ్గా కొనసాగుతోందని శుక్రవారం కెనడా పోలీసులు తెలిపారు.

Published : 23 Jun 2024 05:10 IST

‘1985 విమాన పేలుడు’పై కెనడా పోలీసులు
329 మంది ప్రయాణికుల మృతికి 39 ఏళ్లు

ఒట్టావా: ఎయిర్‌ ఇండియా విమానం ‘కనిష్క ఫ్లైట్‌ 182’పై బాంబు దాడికి సంబంధించిన దర్యాప్తు చురుగ్గా కొనసాగుతోందని శుక్రవారం కెనడా పోలీసులు తెలిపారు. 1985 జూన్‌ 23న కెనడా నుంచి లండన్‌ మీదుగా భారత్‌కు రావాల్సిన ఎయిర్‌ ఇండియా విమానం ‘కనిష్క ఫ్లైట్‌ 182’ లండన్‌లో దిగడానికి 45 నిమిషాలముందు బాంబు దాడికి గురై గాలిలోనే పేలిపోగా అందులో ఉన్న 329 మందీ మరణించారు. మృతుల్లో ఎక్కువమంది భారత సంతతికి చెందిన కెనడియన్లు. ఆపరేషన్‌ బ్లూస్టార్‌కు వ్యతిరేకంగా సిక్కు వేర్పాటువాదులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు అప్పటి విచారణలో తేలింది. నాటి కెనడా ప్రభుత్వం ఈ ఘటనను దేశ చరిత్రలోనే ‘అత్యంత ఘోరమైన ఉగ్రదాడి’గా అభివర్ణించింది. ఈ హేయమైన ఉగ్రచర్య నేటికీ కెనడా పౌరులను కలచివేస్తోందని, దానికి సంబంధించి దర్యాప్తు కూడా చురుగ్గా సాగుతోందని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటనకు గుర్తుగా మృతుల కుటుంబాల పట్ల సానుభూతి ప్రకటిస్తూ దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 39 స్మారక చిహ్నాలు నిర్మించామని, 2025లో 40వ స్మారక చిహ్నాన్ని నిర్మించి ఘనంగా నివాళులు అర్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని