దక్షిణ కొరియాకు మద్దతుగా అమెరికా అణు యుద్ధవాహక నౌక

రష్యాతో సైనిక ఒప్పందం కుదుర్చుకొని కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్న ఉత్తరకొరియా దూకుడుకు కళ్లెం వేయడానికి దక్షిణ కొరియాకు మద్దతుగా అమెరికా తన అణు యుద్ధవాహక నౌకను పంపింది.

Published : 23 Jun 2024 05:11 IST

సియోల్‌: రష్యాతో సైనిక ఒప్పందం కుదుర్చుకొని కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్న ఉత్తరకొరియా దూకుడుకు కళ్లెం వేయడానికి దక్షిణ కొరియాకు మద్దతుగా అమెరికా తన అణు యుద్ధవాహక నౌకను పంపింది. శనివారం ‘థియోడర్‌ రూజ్‌వెల్డ్‌’ నౌక బుసాన్‌ చేరుకుంది. బుధవారం ఉత్తరకొరియా నేత కిమ్‌ జోంగ్‌ ఉన్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ సైనిక ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. యుద్ధ సమయంలో ఒకరికొకరు సాయం చేసుకునేందుకు ఉద్దేశించిన ఈ ఒప్పందంతో కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు పెరిగాయి. తమకు పెను ప్రమాదం పొంచి ఉందని దక్షిణ కొరియా ప్రకటించింది. రష్యా రాయబారిని పిలిపించి తీవ్రంగా హెచ్చరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని