అమెరికా ఆయుధాలు ఆపుతోంది: నెతన్యాహు

అమెరికా నుంచి ఆయుధాల సరఫరా తగ్గిపోయిందని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ఆదివారం తన మంత్రిమండలికి తెలిపారు.

Published : 24 Jun 2024 04:01 IST

టెల్‌అవీవ్‌: అమెరికా నుంచి ఆయుధాల సరఫరా తగ్గిపోయిందని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ఆదివారం తన మంత్రిమండలికి తెలిపారు. 4 నెలల క్రితం నుంచి ఈ తగ్గుదల కనిపించిందని, కొన్ని రకాల ఆయుధాలను అగ్రరాజ్యం నిలిపివేసిందని పేర్కొన్నారు. రఫాపై దాడికి సిద్ధపడొద్దని అమెరికా గత కొంతకాలంగా హెచ్చరికలు చేస్తోంది. అయినా ఇజ్రాయెల్‌ పెడచెవిన పెడుతోంది. ఈ నేపథ్యంలో భారీ బాంబుల సరఫరాను అగ్రరాజ్యం నిలిపివేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని