11వ బిడ్డకు తండ్రి అయిన ఎలాన్‌ మస్క్‌!

ప్రపంచ కుబేరుడు, ‘టెస్లా’ సీఈవో ఎలాన్‌ మస్క్‌ తాజాగా మరోసారి తండ్రి అయ్యారు. న్యూరాలింక్‌ స్పెషల్‌ ప్రాజెక్ట్స్‌ హెడ్‌ అయిన షివాన్‌ జెలీస్‌కు మూడో సంతానం కలిగినట్లు ‘బ్లూమ్‌బెర్గ్‌’ మీడియా సంస్థ పేర్కొంది.

Updated : 24 Jun 2024 05:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచ కుబేరుడు, ‘టెస్లా’ సీఈవో ఎలాన్‌ మస్క్‌ తాజాగా మరోసారి తండ్రి అయ్యారు. న్యూరాలింక్‌ స్పెషల్‌ ప్రాజెక్ట్స్‌ హెడ్‌ అయిన షివాన్‌ జెలీస్‌కు మూడో సంతానం కలిగినట్లు ‘బ్లూమ్‌బెర్గ్‌’ మీడియా సంస్థ పేర్కొంది. ఈ జంటకు 2021లో కవలలు పుట్టిన సంగతి తెలిసిందే. మస్క్‌కు ఇప్పటివరకు మొత్తం 11 మంది సంతానం ఉన్నారు. వీరిలో అయిదుగురు తొలి భార్య జస్టిన్‌ మస్క్‌కు జన్మించారు. మరో ముగ్గురు మ్యుజీషియన్‌ గ్రిమెస్‌కు, ఇంకో ముగ్గురు జెలీస్‌కు పుట్టారు. 2021లో జెలీస్‌కు కవలలు జన్మించిన సమయంలో మస్క్‌ మాట్లాడుతూ ‘‘ఎక్కువమంది సంతానం లేకపోతే నాగరికత కుంగిపోతుంది.. నా మాటలు రాసిపెట్టుకోండి’’ అన్నారు. తన వద్ద పనిచేస్తున్న ఉద్యోగినులతో మస్క్‌ సన్నిహిత సంబంధాలు పెట్టుకోవడం కొత్త కాదు. తనతో పిల్లలను కనాలని మస్క్‌ కోరినట్లు 2013లో ‘స్పేస్‌ఎక్స్‌’ నుంచి ఉద్యోగం మానేసిన ఓ మహిళ వెల్లడించింది. అప్పట్లో వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఈ విషయాన్ని బయటపెట్టింది. అంతే కాదు.. మరో ఇద్దరు ఉద్యోగినులతోనూ ఆయనకు సంబంధాలున్నట్లు ఆరోపణలు వచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని