రష్యాపైకి క్షిపణులు, డ్రోన్లు

ఖర్కీవ్‌పై దాడికి ప్రతీకారంగా రష్యాతోపాటు.. క్రిమియాపైకి ఆదివారం ఉక్రెయిన్‌ భారీ సంఖ్యలో డ్రోన్లు.. క్షిపణులను ప్రయోగించింది.

Published : 24 Jun 2024 04:03 IST

ఆరుగురి మృతి.. వందమందికి పైగా పౌరులకు గాయాలు

కీవ్‌: ఖర్కీవ్‌పై దాడికి ప్రతీకారంగా రష్యాతోపాటు.. క్రిమియాపైకి ఆదివారం ఉక్రెయిన్‌ భారీ సంఖ్యలో డ్రోన్లు.. క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడుల్లో ఆరుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. దాదాపు వందమందికి పైగా పౌరులకు గాయాలయ్యాయి. 33కు పైగా డ్రోన్లను కూల్చివేశామని రష్యా అధికారులు తెలిపారు. శనివారం ఖర్కీవ్‌లోని ఐదు అంతస్తుల భవనంపై రష్యా చేసిన దాడిలో ముగ్గురు పౌరులు మృతి చెందారు. 41 మందికి గాయాలయ్యాయి. దీంతోనే డ్రోన్ల దండును ఉక్రెయిన్‌ పంపింది. ఖర్కీవ్‌.. ఉక్రెయిన్‌లో రెండో అతి పెద్ద నగరం. గత కొన్నాళ్లుగా ఈ ప్రాంతాన్ని హస్తగతం చేసుకోవాలని రష్యా ప్రయత్నిస్తోంది. తీవ్రంగా దాడులు చేస్తోంది. ఉక్రెయిన్‌ దాడి అనంతరం అదివారం మరోసారి ఖర్కీవ్‌పై రష్యా మిసైళ్లను ప్రయోగించింది. ఈ ఘటనలో ఒక పౌరుడు మరణించినట్లు ఉక్రెయిన్‌ అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు