వాతావరణ మార్పులతో నీటి సేకరణకు అధిక సమయం

వాతావరణంలో వస్తున్న మార్పుల ప్రభావం రానున్న రోజుల్లో చాలా అంశాలపై పడనుంది. కర్బన ఉద్గారాలు, అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ వర్షపాతం ఫలితంగా 2050 నాటికి నీటి సేకరణకు మహిళలు సాధారణం కంటే 30 శాతం ఎక్కువ సమయం తీసుకుంటారని ఓ అధ్యయనంలో తేలింది.

Published : 24 Jun 2024 04:56 IST

మహిళల స్థితిగతులపై ప్రభావం

దిల్లీ: వాతావరణంలో వస్తున్న మార్పుల ప్రభావం రానున్న రోజుల్లో చాలా అంశాలపై పడనుంది. కర్బన ఉద్గారాలు, అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ వర్షపాతం ఫలితంగా 2050 నాటికి నీటి సేకరణకు మహిళలు సాధారణం కంటే 30 శాతం ఎక్కువ సమయం తీసుకుంటారని ఓ అధ్యయనంలో తేలింది. ఇది వారి చదువు, ఉద్యోగం, ఆసక్తులపై దృష్టి కేంద్రీకరించలేని పరిస్థితులకు దారితీయనుందట. జర్మనీకి చెందిన ఇనిస్టిట్యూట్‌ ఫర్‌    క్లైమేట్‌ ఇంపాక్ట్‌ రీసెర్చి(పీఐకే)కి చెందిన కొందరు పరిశోధకులు ఒక బృందంగా ఏర్పడి, 1990 నుంచి 2019 మధ్యలో ఇంట్లో నల్లాల సదుపాయం లేని మహిళలు నీటి కోసం ఎంత దూరం వెళ్తున్నారు? ఎంత సమయం కేటాయిస్తున్నారు? తదితర అంశాలపై నిశితంగా పరిశీలించారు. ప్రతి రోజూ నీటి సేకరణకు వారు సగటున 23 నిమిషాలు కేటాయిస్తున్నట్లు ఓ నిర్ణయానికొచ్చారు. గ్లోబల్‌ వార్మింగ్‌ను రెండు డిగ్రీల సెల్సియస్‌ లోపే కొనసాగించగలిగితే.. ఆ 30 శాతం అదనంగా పట్టే సమయాన్ని 19 శాతానికి తగ్గించవచ్చట. వాతావరణ మార్పులు పరోక్షంగా మహిళలు జీవన స్థితిగతులపై పెను ప్రభావం చూపనున్నట్లు పరిశోధకులు స్పష్టం చేశారు. నీటి కోసమే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుండటంతో.. చదువు, ఉద్యోగం, కుటుంబానికి వారు వెచ్చించే కాలం గణనీయంగా తగ్గిపోనుందట.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని