దెబ్బతిన్న రక్తనాళాలతో తీవ్ర మతిమరుపు

మెదడులోని రక్తనాళాలకు సంబంధించిన ఒక రుగ్మత వల్ల తీవ్ర మతిమరుపు (డిమెన్షియా), అల్జీమర్స్‌ తలెత్తుతాయనడానికి జన్యు ఆధారాలను అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ రుగ్మతల నివారణకు తమ పరిశోధన దోహదపడుతుందని వారు వివరించారు.

Published : 25 Jun 2024 05:29 IST

జన్యు ఆధారాల గుర్తింపు 

దిల్లీ: మెదడులోని రక్తనాళాలకు సంబంధించిన ఒక రుగ్మత వల్ల తీవ్ర మతిమరుపు (డిమెన్షియా), అల్జీమర్స్‌ తలెత్తుతాయనడానికి జన్యు ఆధారాలను అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ రుగ్మతల నివారణకు తమ పరిశోధన దోహదపడుతుందని వారు వివరించారు. మెదడులో సెరిబ్రల్‌ స్మాల్‌ వెజల్‌ డిసీజ్‌ అనే రుగ్మత వల్ల రక్తనాళాలు కుంచించుకుపోతుంటాయి. ఫలితంగా రక్త ప్రవాహానికి అవరోధాలు ఏర్పడుతుంటాయి. దీనివల్ల పక్షవాతం తలెత్తవచ్చు. ఇలాంటివారి మెదడులో వైట్‌ మ్యాటర్‌ హైపర్‌ఇంటెన్సిటీ (డబ్ల్యూఎంహెచ్‌) ఉత్పన్నమవుతుంటుంది. ఫలితంగా మెదడుకు గాయాలవుతుంటాయి. సెరిబ్రల్‌ స్మాల్‌ వెజల్‌ డిసీజ్‌ వల్ల విషయగ్రహణ సామర్థ్యం దెబ్బతినడం, డిమెన్షియా వస్తుందనే భావన శాస్త్రవేత్తల్లో ఉంది. అల్జీమర్స్‌ కూడా ఒకరకమైన డిమెన్షియానే. అయితే డబ్ల్యూఎంహెచ్‌ గాయాల వల్ల పక్షవాతం, డిమెన్షియా వస్తాయనడానికి శాస్త్రవేత్తలకు ఇప్పటివరకూ నిర్దిష్టంగా ఆధారాలు దొరకలేదు.  

తాజాగా అమెరికాలోని టెక్సాస్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధన చేశారు. మెదడులో రక్తనాళాలు దెబ్బతినడం వల్ల డిమెన్షియా వస్తుందనడానికి జన్యు ఆధారాలను గుర్తించారు. ఇలాంటి వారిలో జ్ఞాపకశక్తి క్షీణించి, ఆలోచనశక్తి సన్నగిల్లుతుందని వివరించారు. ఫలితంగా వారి రోజువారీ జీవితంపై ప్రభావం పడుతోందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని