ఆసుపత్రి పాలైన బ్రిటన్‌ యువరాణి

బ్రిటన్‌ యువరాణి, కింగ్‌ ఛార్లెస్‌-3 సోదరి అనే (73) తలకు బలమైన గాయం తగిలి ఆసుపత్రి పాలయ్యారు. ఈ మేరకు బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.

Published : 25 Jun 2024 05:32 IST

లండన్‌: బ్రిటన్‌ యువరాణి, కింగ్‌ ఛార్లెస్‌-3 సోదరి అనే (73) తలకు బలమైన గాయం తగిలి ఆసుపత్రి పాలయ్యారు. ఈ మేరకు బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. త్వరలోనే ఆమె పూర్తిగా కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేసింది. బ్రిస్టల్‌లోని గాట్‌కాంబ్‌ పార్క్‌ ఎస్టేట్‌లో ఆదివారం సాయంత్రం అనే గాయపడ్డారు. దీంతో వెంటనే ఆమెను స్థానిక సౌత్‌మేడ్‌ ఆసుపత్రిలో చేర్చారు. ఆ ఎస్టేట్‌లో ఉండే ఓ గుర్రం కారణంగా ఆమె తలకు దెబ్బతగిలినట్లుగా భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని