మళ్లీ ఉత్తరకొరియా నుంచి చెత్త బెలూన్లు

ఉభయ కొరియాల మధ్య బెలూన్ల యుద్ధం ఆగడం లేదు. మళ్లీ చెత్త బెలూన్లను ఉత్తరకొరియా పంపించడం ప్రారంభించిందని సోమవారం దక్షిణ కొరియా సైన్యం తెలిపింది.

Published : 25 Jun 2024 05:33 IST

సియోల్‌: ఉభయ కొరియాల మధ్య బెలూన్ల యుద్ధం ఆగడం లేదు. మళ్లీ చెత్త బెలూన్లను ఉత్తరకొరియా పంపించడం ప్రారంభించిందని సోమవారం దక్షిణ కొరియా సైన్యం తెలిపింది. గతంలో ఆ దేశం పంపిన బెలూన్లలో ఎరువులు, సిగరెట్‌ పీకలు, చెత్త వస్తువులు, వ్యర్థ బ్యాటరీలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రయోగించిన బెలూన్లు దక్షిణంవైపునకు కదులుతున్నట్లు అధికారులు తెలిపారు. బెలూన్లను తాకొద్దని.. కనిపిస్తే దగ్గర్లోని పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఇప్పటికే పౌరులకు దక్షిణ కొరియా సూచించింది. మే చివరి వారం నుంచి ఈ బెలూన్ల యుద్ధం రెండు దేశాల మధ్య సాగుతోంది. తాజాగా దక్షిణకొరియా 20 బెలూన్లను పంపిందని, అందులో తమకు వ్యతిరేకంగా కరపత్రాలు, పాప్‌ గీతాలు, టీవీ సీరియళ్లు ఉన్నాయని ఉత్తరకొరియా తెలిపింది. అందుకు ప్రతీకారంగానే చెత్త బెలూన్లను పంపడం మళ్లీ ప్రారంభించామని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని