భిన్న వాతావరణ పరిస్థితులతో అమెరికా అతలాకుతలం

ఒకవైపు అధిక ఉష్ణోగ్రతలు, మరోవైపు భారీ వర్షాలు అమెరికాను అతలాకుతలం చేస్తున్నాయి. సోమవారం అధిక ప్రాంతాల్లో ఎండలు విజృంభించగా.. సౌత్‌ డకోటాలో మాత్రం వరదల ధాటికి ఒకరు మృతిచెందడం గమనార్హం.

Published : 25 Jun 2024 05:34 IST

డకోటా: ఒకవైపు అధిక ఉష్ణోగ్రతలు, మరోవైపు భారీ వర్షాలు అమెరికాను అతలాకుతలం చేస్తున్నాయి. సోమవారం అధిక ప్రాంతాల్లో ఎండలు విజృంభించగా.. సౌత్‌ డకోటాలో మాత్రం వరదల ధాటికి ఒకరు మృతిచెందడం గమనార్హం. ఆగ్నేయ ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలతోపాటు ఉక్కపోత కొనసాగొచ్చనీ, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం హెచ్చరించింది. సౌత్‌ డకోటా, అయోవా, మిన్నెసొటా తదితర ప్రాంతాల్లో వరదల ప్రభావం ఉంటుందని వెల్లడించింది. వర్ష బీభత్సంతో భారీ రైల్వే వంతెన కూలి సియోక్స్‌ నదిలో పడిపోయినట్లు ఓ అధికారి తెలిపారు. అయోవా నగరంలో రెండో రోజు సైతం కర్ఫ్యూ కొనసాగింది. ఉత్తర అయోవాకు చెందిన 21 కౌంటీల్లో ప్రస్తుత వరదలను ఓ విపత్తుగా అధికారులు ప్రకటించారు. కొన్ని చోట్ల సాధారణం కంటే ఎనిమిది రెట్ల వర్షపాతం నమోదైంది. సియోక్స్‌ కౌంటీ చుట్టుపక్కల నగరాల్లో కేవలం మూడు రోజుల్లోనే దాదాపు 25 నుంచి 38 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు అధికారులు ప్రకటించారు. మిస్సోరీ నదీ తీరం వెంబడి వరదలు వచ్చే ప్రమాదం ఉందనీ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వాషింగ్టన్‌ డీసీ, బాల్టిమోర్, ఫిలడెల్ఫియాల్లో మాత్రం రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని