బ్యాటరీ పరిశ్రమలో పేలుడు.. 22 మంది దుర్మరణం

లిథియం బ్యాటరీ తయారీ పరిశ్రమలో పేలుడు సంభవించడంతో 22 మంది కార్మికులు దుర్మరణం చెందిన సంఘటన దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో తొమ్మిది మంది గాయపడ్డారు.

Published : 25 Jun 2024 05:36 IST

సియోల్‌లో అగ్నిప్రమాదం జరిగిన బ్యాటరీ పరిశ్రమ

సియోల్‌: లిథియం బ్యాటరీ తయారీ పరిశ్రమలో పేలుడు సంభవించడంతో 22 మంది కార్మికులు దుర్మరణం చెందిన సంఘటన దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో తొమ్మిది మంది గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఫ్యాక్టరీ రెండో అంతస్తులో సోమవారం బ్యాటరీల పనితీరును సిబ్బంది పరీక్షిస్తూ.. ప్యాకింగ్‌ చేస్తుండగా ఒక్కసారిగా అవి పేలాయి. ఆ సమయంలో అక్కడ మొత్తం 102 మంది కార్మికులు విధుల్లో ఉన్నారని స్థానిక అధికారి తెలిపారు. మృతిచెందిన వారిలో 18 మంది చైనా నుంచి పని కోసం వలస వచ్చిన వారే. ప్రమాదానికి కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తునకు ఆదేశించామని అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని