ఇజ్రాయెల్‌ దాడిలో హెజ్‌బొల్లా కమాండర్‌ మృతి

ఇజ్రాయెల్‌-లెబనాన్‌ మధ్య ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరుకుంటున్న వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.

Published : 04 Jul 2024 04:06 IST

బీరుట్‌: ఇజ్రాయెల్‌-లెబనాన్‌ మధ్య ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరుకుంటున్న వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బుధవారం ఉదయం ఇజ్రాయెల్‌ వైమానిక దాడిలో హెజ్‌బొల్లా సీనియర్‌ కమాండర్‌ మహమ్మద్‌ నామేహ్‌ నజీర్‌ ప్రాణాలు కోల్పోయారు. అజీజ్‌ గ్రూపునకు ఆయన కమాండర్‌గా ఉన్నారు. లెబనాన్‌లోని టైర్‌ నగరంలో ఈ దాడి జరిగింది. ఈ విషయాన్ని హెజ్‌బొల్లా ధ్రువీకరించింది. మరోవైపు గాజాలో ఇజ్రాయెల్‌ దాడిలో ప్రముఖ పాలస్తీనా వైద్యుడొకరు, ఆయన కుటుంబానికి చెందిన ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఖాన్‌ యూనిస్‌ నగరాన్ని ఖాళీ చేయమని ఐడీఎఫ్‌ హెచ్చరికలు జారీ చేయడంతో వీరంతా దేర్‌-అల్‌-బలాలోని ఓ సురక్షిత ప్రాంతానికి వెళ్లారు. మంగళవారం ఆ ప్రాంతంపైనా ఇజ్రాయెల్‌ వైమానిక దాడి నిర్వహించింది. 

వెస్ట్‌బ్యాంకులో ఇజ్రాయెల్‌ పాగా

జెరూసలెం: వెస్ట్‌బ్యాంకులోని భూభాగాలను ఇజ్రాయెల్‌ హస్తగతం చేసుకుంటోంది. ఇటీవల దాదాపు 12.7 చదరపు కిలోమీటర్ల భూభాగం కోసం ఆదేశాలు జారీ చేసింది. గత మూడు దశాబ్దాల్లో ఈ స్థాయిలో భూజప్తునకు ఇజ్రాయెల్‌ ఉత్తర్వులివ్వడం ఇదే తొలిసారని ఇజ్రాయెల్‌ గ్రూప్‌.. ‘పీస్‌ నౌ’ పేర్కొంది. మార్చిలో 8 చదరపు కిలోమీటర్లు, ఫిబ్రవరిలో 2.6 చదరపు కిలోమీటర్లు భూభాగాన్ని ఇజ్రాయెల్‌ తన అధీనంలోకి తెచ్చుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని