బెంబేలెత్తించిన బెరిల్‌.. ద్వీపం ధ్వంసం!

కరీబియన్‌ దీవుల్లో భీకర ‘బెరిల్‌’ హరికేన్‌ భారీ విధ్వంసం సృష్టించింది. గంటకు దాదాపు 150 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు అనేక దీవుల్లో తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టానికి దారితీశాయి.

Published : 04 Jul 2024 06:19 IST

క్లిఫ్టన్‌: కరీబియన్‌ దీవుల్లో భీకర ‘బెరిల్‌’ హరికేన్‌ భారీ విధ్వంసం సృష్టించింది. గంటకు దాదాపు 150 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు అనేక దీవుల్లో తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టానికి దారితీశాయి. 20 ఏళ్ల క్రితం వచ్చిన ‘ఐవాన్‌’ తర్వాత.. అంతటి భారీ హరికేన్‌ ఇదేనని స్థానిక అధికారిక యంత్రాంగం వెల్లడించింది. సెయింట్‌ విన్సెంట్, గ్రెనడైన్స్‌లోని ‘యూనియన్‌ ఐలాండ్‌’లో 90 శాతం ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఉన్న ఒక్క విమానాశ్రయం పైకప్పు మొత్తం ఎగిరిపోయింది. ఇప్పటివరకు ఈ దీవిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పక్కనే ఉన్న బెఖియా దీవిలోనూ తీవ్ర ఆస్తి నష్టం సంభవించింది. తాగునీరు, విద్యుత్‌ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని