తోషాఖానా కేసులో ఇమ్రాన్‌కు మరో ఊరట

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌(71)ను వెంటాడిన తోషాఖానా కేసులో మరో ఊరట లభించింది.

Published : 04 Jul 2024 06:20 IST

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌(71)ను వెంటాడిన తోషాఖానా కేసులో మరో ఊరట లభించింది. 2022లో తోషాఖానా అవినీతికి సంబంధించి ఆయన్ను ఎన్నికల కమిషన్‌ అనర్హుడిగా ప్రకటించడంపై నిరసన ప్రదర్శన జరిపినందుకు నమోదైన కేసు నుంచి బుధవారం ఇమ్రాన్‌తోపాటు ఆయన పార్టీ సీనియర్‌ నేతలను ఇస్లామాబాద్‌ జిల్లా సెషన్స్‌ కోర్టు విముక్తుల్ని చేసింది. ఇతర దేశాల అధినేతల నుంచి పాకిస్థాన్‌ పాలకులకు అందే బహుమతులను భద్రపరిచే ఖజానాను తోషాఖానా అంటారు. ప్రధాని హోదాలో తనకు అందిన బహుమతులను ఇమ్రాన్‌ అమ్ముకున్నారని ఆరోపణ వచ్చింది. నిరుడు ఆగస్టు 5న తోషాఖానా కేసులో ఇమ్రాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించినా ఇస్లామాబాద్‌ హైకోర్టు దాన్ని సస్పెండ్‌ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని