బ్రిటన్‌ పార్లమెంటు బరిలో భారత సంతతి అభ్యర్థుల హవా

బ్రిటన్‌ పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమైంది. గురువారం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 2019 ఎన్నికల్లో భారత సంతతి అభ్యర్థులు రికార్డు స్థాయిలో ఎన్నికై పార్లమెంటులో అడుగడుపెట్టి చరిత్ర సృష్టించారు.

Published : 04 Jul 2024 06:12 IST

ప్రధాన పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో టికెట్లు

లండన్‌: బ్రిటన్‌ పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమైంది. గురువారం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 2019 ఎన్నికల్లో భారత సంతతి అభ్యర్థులు రికార్డు స్థాయిలో ఎన్నికై పార్లమెంటులో అడుగడుపెట్టి చరిత్ర సృష్టించారు. ఈ దఫా ఎన్నికల్లోనూ అటు కన్జర్వేటివ్‌ పార్టీ, ఇటు లేబర్‌ పార్టీ తరఫున పెద్ద సంఖ్యలో భారత మూలాలున్న అభ్యర్థులు బరిలోకి దిగారు. 2019లో 15 మంది భారత సంతతివారు పార్లమెంటు దిగువ సభ అయిన హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌కు ఎన్నికయ్యారు. ఈదఫా కన్జర్వేటివ్‌ పార్టీ తరఫున ప్రధాని రిషి సునాక్‌తో పాటు శైలేష్‌ వారా, ప్రీతి పటేల్, గగన్‌ మొహీంద్ర, క్లెయిర్‌ కౌటిన్హో మరోసారి అభ్యర్థులుగా రంగంలోకి దిగారు. వీరితోపాటు కొత్తగా శివానీ రాజా, అమీత్‌ జోగియా తదితరులకు ఈ పార్టీ టికెట్లు ఇచ్చింది. ఇదే పార్టీ నుంచి తెలుగు సంతతికి చెందిన చంద్ర కన్నెగంటి బరిలో ఉన్నారు. మరోవైపు లేబర్‌ పార్టీ తరఫున నవేందు మిశ్రా, ప్రీత్‌ కౌర్‌ గిల్, తన్మన్‌జీత్‌ సింగ్‌ దేశి, లీసా నంది, సీమా మల్హోత్రా తదితరులు పోటీ చేస్తున్నారు. ఇతర పార్టీలు కూడా భారత సంతతి వ్యక్తులకు టికెట్లు ఇచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని