పారిస్‌లోని ‘గాలరీలఫాయెట్‌’లో యూపీఐ సేవలు

పారిస్‌లోని ప్రముఖ షాపింగ్‌మాల్‌.. ‘గాలరీ లఫాయెట్‌’లో యూపీఐ సేవలు ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని ఫ్రాన్స్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.

Published : 05 Jul 2024 04:43 IST

లండన్‌/పారిస్‌: పారిస్‌లోని ప్రముఖ షాపింగ్‌మాల్‌.. ‘గాలరీ లఫాయెట్‌’లో యూపీఐ సేవలు ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని ఫ్రాన్స్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ‘‘గతంలో ఐఫిల్‌ టవర్‌లో విజయవంతంగా యూపీఐ సేవలను ప్రారంభించాం. ఇప్పుడు పరిధి పెరిగింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన గాలరీ లఫాయెట్‌లోనూ యూపీఐ లావాదేవీలు ప్రారంభమయ్యాయి’’ అని గురువారం విడుదల చేసిన ప్రకటనలో రాయబార కార్యాలయం పేర్కొంది. ప్రఖ్యాత ఐఫిల్‌ టవర్‌ను సందర్శించే పర్యాటకులు యూపీఐ ద్వారా రుసుమును చెల్లించే సౌలభ్యాన్ని ఫిబ్రవరి 2న భారత్‌ ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు