షికాగోలో కాల్పులు.. ఇద్దరు మహిళల మృతి

అమెరికాలోని షికాగో సమీపంలో గ్రాండ్‌ క్రాసింగ్‌ వద్ద గురువారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు మహిళలు మృతిచెందారు. గాయపడిన మరో ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

Published : 05 Jul 2024 04:49 IST

ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమం

షికాగో: అమెరికాలోని షికాగో సమీపంలో గ్రాండ్‌ క్రాసింగ్‌ వద్ద గురువారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు మహిళలు మృతిచెందారు. గాయపడిన మరో ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇది వ్యక్తిగత లక్ష్యంతో జరిగిన దాడిగా పేర్కొన్నారు. సాయుధులు ఆ మహిళలు నివసిస్తున్న ఇంటిపై కాల్పులు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. కాల్పుల్లో 5.. 7 ఏళ్ల వయసు గల ఎడ్వర్డ్స్‌ పిల్లలు ఇద్దరు తీవ్రంగా గాయపడగా, ఏడాది వయసున్న చిన్నారిని ఆమె చుట్టుకొని కాపాడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ పిల్లలకు సోదరుడి వరసైన మరో బాలుడు (8) కూడా తీవ్రంగా గాయపడ్డాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని