వెస్ట్‌బ్యాంకులో ఏడుగురి మృతి

వెస్ట్‌బ్యాంకులోని జెనిన్‌ ప్రాంతంలో ఇజ్రాయెల్‌ చేపట్టిన సైనిక ఆపరేషన్‌లో ఏడుగురు మృతి చెందారని పాలస్తీనా అథారిటీ వర్గాలు తెలిపాయి.

Published : 06 Jul 2024 04:09 IST

జెరూసలెం: వెస్ట్‌బ్యాంకులోని జెనిన్‌ ప్రాంతంలో ఇజ్రాయెల్‌ చేపట్టిన సైనిక ఆపరేషన్‌లో ఏడుగురు మృతి చెందారని పాలస్తీనా అథారిటీ వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమంలో భాగంగా ఈ ఆపరేషన్‌ నిర్వహించామని ఇజ్రాయెల్‌ తెలిపింది. ‘‘ఉగ్రవాదులు తలదాచుకున్న భవనాలను చుట్టుముట్టాం. ఈ సందర్భంగా కాల్పులు జరిగాయి. కొంత మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాం’’ అని పేర్కొంది. పాలస్తీనా ఆరోగ్యమంత్రిత్వశాఖ మాత్రం ఏడుగురు చనిపోయారని మాత్రమే తెలిపింది. కాల్పుల సందర్భంగా చనిపోయారా లేదా అన్న విషయాన్ని పేర్కొనలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని